ఏంటి అది నిజమేనా? గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబోలో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ భారీ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని మేకర్స్ ఒక గ్లోబ్ ట్రాటింగ్ అడ్వాంచర్ థ్రిల్లర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈరోజు ముహుర్త కార్యక్రమాలతో మొదలవుతున్న ఈ మూవీ కోసం అభిమానులు రెండేళ్లో లేక నాలుగేళ్లో ఎదురు చూడాల్సిందే అని గట్టిగాఆ ఫిక్స్ అయిపోయారు. మరి వీటికి తగ్గట్టుగానే పలు క్రేజీ రూమర్స్ ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై అప్పుడే మొదలయ్యాయి. వీటితో ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయడం గ్యారంటీ అని తెలుస్తుంది.
అలాగే వీటిలో మొదటి భాగాన్ని ఈ 2027లో విడుదల కి తీసుకొస్తే రెండో భాగాన్ని 2029 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ గట్టిగా వినపడుతున్నాయి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల విషయంలో మేకర్స్ ముందు నుంచీ గట్టి ప్లానింగ్ లోనే ఉన్నారని తెలుస్తుంది.