ఆమె ఏమందంటే! బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు, ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఉద్దేశించి గాయకుడు మికా సింగ్ చేసిన నెగిటివ్ కామెంట్స్ గురించి తెలిసిందే. ‘బిపాసా బసు, కరణ్ గ్రోవర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డేంజరస్’ వెబ్ సిరీస్‌కు మికా సింగ్ నిర్మాతగా వ్యవహరించాడు.
ఆ సిరీస్‌ను రూ.4 కోట్లలో చిత్రీకరించాలని బడ్జెట్ పెట్టుకుంటే, బిపాసా దంపతుల వల్ల రూ.14 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి రావడం చాలా దారుణం’ అని మికా సింగ్ తెలిపారు. వారి వల్ల తాను ఆర్థికంగా ఎంతో నష్టపోయానని మికా సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిపాసా బసు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
‘విషపూరితమైన స్వభావం కలిగిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తూ ఎదుటి వారిని బాధ పెడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపైనా ఉండాలి’’ అని బిపాసా బసు, మికా సింగ్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.