ఫ్యాషన్ కోసం వేసుకున్నా ప్రెగ్నేంట్‌ ఏనా?

తన ప్రెగ్నెన్సీ రూమర్స్ పై బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా స్పందించారు. ఆమె తాజాగా నటించిన చిత్రం అమర్ సింగ్‌ చంకీల .  ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్ లో ఆమె పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి పరిణీతి వేసుకుని వచ్చిన దుస్తుల గురించి ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఆమె తల్లి కాబోతుందని.. అందుకే బేబీ బంప్‌ కనిపించకుండా ఇలాంటి డ్రెస్ వేసుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

దీంతో పరిణీతి ఇన్‌ స్టా వేదికగా స్పందించింది. ఫ్యాషన్‌ కోసం వదులుగా ఉండే దుస్తులు వేసుకున్నా.. పెద్ద సైజ్ డ్రెస్‌ ధరించినా…సౌకర్యవంతంగా ఉండే బట్టలు వేసుకుంటే ప్రెగ్నేన్సీ అని భావిస్తారా అంటూ నవ్వు ఎమోజీని ట్యాగ్‌ చేసింది. దీంతో ఆమె గర్భం గురించిన వార్తలకు చెక్ పడింది.

పరిణీతి , ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాను గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నటించిన అమర్‌ సింగ్‌ చంకీల సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories