ఈ సంక్రాంతికి మహేష్‌ మెచ్చిన సినిమా ఏదంటే!

టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగ బరిలో ఏకంగా మూడు పెద్ద  చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు మూడు కూడా ఉన్నాయి. అయితే, ఈ మూడు సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది.

ప్రస్తుతం ఎవరి నోట విన్నా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంతో  ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైనశైలిలో  రివ్యూ ఇచ్చాడు.

 ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీని సూపర్‌ గా ఎంజాయ్ చేశానని.. పండగకు సరైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారని.. వెంకటేష్ టెర్రిఫిక్‌గా నటించారని.. అనిల్ రావిపూడిని చూసి చాలా గర్వంగా ఉందని.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా బుల్లి రాజు పాత్రలో నటించిన చిన్నబ్బాయి ఇరగదీశాడని.. మహేష్ చెప్పాడు.

ఇలాంటి ఎంటర్‌టైనింగ్ చిత్రంతో సక్సెస్ అందుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర టీమ్‌కు అభినందనలు అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories