అట్లీ ప్లాన్ ఏంటసలు! ప్రస్తుతం టాలీవుడ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో రానున్న AAA ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఈ సినిమాను ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకున్న మేకర్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. అయితే, ఈ సందర్భంగా ఈ మూవీ కథను అట్లీ చాలా పకడ్బందీగా రెడీ చేస్తున్నాడని.. ఇందులో ఓ సాలిడ్ సర్ప్రైజ్ను కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.