ఏమైంది..! తమిళ్ సినిమా సహా తెలుగులో కూడా బాగా తెలిసిన కోలీవుడ్ నటుల్లో యాక్షన్ హీరో విశాల్ ఒకరు. విశాల్ తన “రత్నం” సినిమాతో గతేడాది పలకరించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఈ సంక్రాంతికి తాను నటించిన 12 ఏళ్ళు క్రితం మూవీ “మద గజరాజ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అయితే ఈ సినిమా ఈవెంట్ లో లేటెస్ట్ గా విశాల్ పాల్గొనగా తనపై కొన్ని షాకింగ్ విజువల్స్ ఇపుడు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇందులో విశాల్ చాలా బక్క చిక్కిపోయి కనపడుతున్నాడు. ఇన్ని రోజులు ఎంతో ఫిట్ గా కనిపించిన విశాల్ ఇలా కనిపించడం తమిళ్ ఆడియెన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు యువతకి కూడా షాకింగ్ గా ఉంది. ఇంతకంటే షాకింగ్ అంశం ఏమిటంటే విశాల్ కనీసం సరిగ్గా మాట్లాడలేకపోవడం మైక్ పట్టుకొని ఉన్నపుడు ఆయన చేయి వణకడం క్లియర్ గా కనపడుతుంది.
దీంతో అసలు విశాల్ కి ఏమయ్యింది అనే మాటలు వినపడుతున్నాయి. అయితే ప్రస్తుతం విశాల్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నాడని పలు కామెంట్లు వినపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాత్రం విశాల్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.