అసలు ఏం ప్లాన్‌ చేశాడంటారు ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నతాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై బజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఏర్పడింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు సిద్దంగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్‌ వేగవంతం చేశారు . జనవరి 2న ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడని.. అందులో ఒకటి ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్ర.. మరొకటి ఐఏఎస్ పాత్ర అని ఇప్పటివరకు చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది.

తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఐపీఎస్‌గా కనిపించబోతున్నట్లు ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. దీంతో అసలు ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్ని పాత్రల్లో కనిపిస్తాడా అనే చర్చ జోరుగా సాగుతోంది. డైరెక్టర్‌ శంకర్ ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్లు అభిమానులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఒక్క పోస్టర్‌తో ‘గేమ్ ఛేంజర్’ను మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చేశారు నిర్మాతలు.

Related Posts

Comments

spot_img

Recent Stories