ఆ సినిమా గురించి వెంకీ మామ ఏమన్నాడంటే! టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”తో తన కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసింగ్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత తన నుంచి మరిన్ని ప్రాజెక్ట్స్ రానుండగా వాటిలో తన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “రానా నాయుడు – సీజన్ 2” కూడా ఒకటి.
ఈ సిరీస్ లో రానా దగ్గుబాటి కూడా సాలిడ్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే సీజన్ 1 హిట్ అయ్యినప్పటికీ చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. అయినప్పటికీ మేకర్స్ సీజన్ 2 ప్రకటించి షూటింగ్ కూడా చేయడం జరిగింది. అయితే దీనిపై తాజాగా వెంకీ మామ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రానా నాయుడు సీజన్ 1 కి చాలా కంప్లైంట్స్ వచ్చాయని వాటిని సీజన్ 2 లో రిపీట్ కాకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక ఈ అవైటెడ్ సిరీస్ ఆల్రెడీ డబ్బింగ్ కంప్లీట్ కాగా నెట్ ఫ్లిక్స్ వారు ఈ మార్చ్ లో తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు.