ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్న భారీ సినిమా “జన నాయకుడు” పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ గిఫ్ట్ ఫ్యాన్స్ కు ఓ పెద్ద ఆనందంగా మారింది.
ఇక విజయ్ బర్త్‌డే సందర్భంగా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అందరిలోకన్నా స్పెషల్‌గా త్రిష ఇచ్చిన విషెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విజయ్‌కి విషెస్ చెబుతూ ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఇద్దరూ కూర్చొని ఉండగా, విజయ్ చేతిలో ఓ క్యూట్ కుక్క పిల్ల ఉంది.
ఈ ఫోటోను త్రిష ‘హ్యాపీ బర్త్‌డే డియరెస్ట్’ అంటూ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ లో సందడి అయిపోయింది. ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ అయింది. ఇప్పటికే వీరిద్దరూ కలసి నటించిన “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” సినిమాతో స్క్రీన్ మీద మంచి కాంబినేషన్ చూపించారు. ఇక త్రిష తాజాగా కమల్ హాసన్‌తో చేస్తున్న “థగ్ లైఫ్” లో కూడా కనిపించింది.
విజయ్ – త్రిష మధ్య ఉన్న కెమిస్ట్రీపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడీ బర్త్‌డే పోస్ట్ ఆ ఆసక్తిని మరింత పెంచేసింది. దీంతో ఈ పిక్ ఓ సూపర్ హీట్ సోషల్ మీడియా మామెంట్ గా నిలిచింది.