బండ్ల గణేష్ గురించి చెప్పుకుంటే, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని అందరూ బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ ని దేవుడిలా భావించే అభిమానుల్లో ఒకరిగా తనని తాను చూపించుకున్న ఆయన, నిజానికి పవన్ ఫ్యాన్స్ లో చాలామంది మనసుల్లో కూడా అదే ఫీలింగ్ ని రేపుతారు. అందుకే బండ్ల గణేష్ ని చూస్తే, పవన్ అభిమానుల మోజు ఎంత ఉందో అర్థమవుతుంది.
కానీ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమాల ఈవెంట్స్ లో బండ్ల గణేష్ కనిపించకపోవడం అభిమానుల్లో చర్చగా మారింది. ఇప్పుడు పవన్ నటిస్తున్న భారీ సినిమా ఓజి ఈవెంట్ కి ఆయన హాజరవుతారా లేదా అన్నది అందరి కుతూహలంగా మారింది. ఇదిలా ఉండగా, ఓజి సినిమాపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
తాను కూడా పవన్ కోట్లాది అభిమానుల్లో ఒకడినే అని చెబుతూ, ఓజి తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.