ఆ వార్తలపై “కల్కి” మేకర్స్ ఏమన్నారంటే! పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా సెన్సేషనల్ హిట్ సినిమా “కల్కి 2898 ఎడి” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాతో నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు మళ్ళీ టాలీవుడ్ లో క్రేజీ కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇపుడు కల్కి పార్ట్ 2 సహా వారి అనుబంధ సంస్థల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నిర్మాణ సంస్థకి సంబంధించిన ఓ వ్యక్తి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్స్ వేస్తుండగా హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఈ నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
అరెస్ట్ అయిన నీలేష్ చోప్రాకి మాకు ఎలాంటి సంబంధం లేదని మాతో అతను ఎప్పుడూ కలిసి పని చేసింది లేదని తెలిపారు. సో వీటిపై తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు అలా చేసిన వాటిని కూడా ఎవరు నమ్మొద్దు అంటూ చెప్పుకోచ్చారు. దీంతో తమ క్లారిటీ ఇపుడు వైరల్ అవుతుంది..