ఆయన ఏమన్నారంటే

ఆయన ఏమన్నారంటే! టాలీవుడ్‌లో హిట్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. వరుసగా 8 సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా మలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఈ యంగ్‌ డైరెక్టర్. ఇక ఈయన తెరకెక్కించిన తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది. 

ఇక ఇప్పుడు అందరి చూపు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించబోయే తరువాత సినిమా పై పడింది. అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాపై నిర్మాత సాహు గారపాటి తాజాగా కొన్ని ఆసక్తికర కామెంట్లు . ‘లైలా’ మూవీ లాంచ్‌లో ఆయన ఈ మేరకు కామెంట్స్ చేశారు. 

మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి చేయబోయే సినిమా బ్లాక్‌బస్టర్ ఖాయమని.. ఈ సినిమా ఎమోషనల్ కథతో రాబోతుందని ఆయన తెలిపారు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి కెరీర్‌లో ట్రిపుల్ హ్యాట్రిక్ ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు.

Related Posts

Comments

spot_img

Recent Stories