ఆ కామెంట్ల పై హరీష్ శంకర్ ఏమన్నాడంటే! టాలీవుడ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ లో తన సత్తా చాటిన వారిలో హరీష్ శంకర్ ఒకరు. స్ట్రైట్ సినిమా అయినా రీమేక్ సినిమాని అయినా కూడా తమ మార్క్ టేకింగ్ తో ఆవిష్కరించే హరీష్ కి ఎప్పటి నుంచో పలు వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా విషయంలో కూడా తాను పలు విమర్శలు అందుకు తాను క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే లేటెస్ట్ గా హరీష్ చేసిన కామెంట్స్ విషయంలో తెలుగు యువత కౌంటర్లు ఇస్తున్నారు. మన సినిమాలు మనమే చూడం అనే హరీష్ శంకర్ స్టేట్మెంట్ పై విమర్శలు వస్తున్నాయి. వేరే భాషల్లో చూసేసిన సినిమాలు మళ్ళీ రీమేక్స్ గా తీసుకొస్తే ఎవరు చూస్తారు ఎవరు చూడరని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కావాలంటే వేరే భాషలు సినిమాలు నుంచి ప్రేరణ పేరిట చూసిన సినిమాలే ఇక్కడ తీసేయోచ్చు అంటూ రివర్స్ లో హరీష్ శంకర్ పై నెటిజన్స్ పంచ్ లు వేస్తున్నారు. అయితే ఇలాంటి విమర్శలు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా వినిపించాయి కానీ వాటికి గ్లింప్స్ తోనే తాను సమాధానం ఇచ్చారు. మరి ఈ హంగామా అంతా ఎక్కడ ఆగుతుందో చూడాలి.