పుష్ప 3 గురించి బన్నీ ఏమన్నాడంటే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్ తెరకెక్కించిన తాజా పాన్ ఇండియా సూపర్‌ హిట్‌ మూవీ “పుష్ప 2” గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధించి దుమ్ము లేపింది. మరి మేకర్స్ ఈ ఫ్రాంచైజ్ ని మూడు భాగాలతో ఎండ్ చేస్తామని ఇంతకు ముందే ప్రకటించారు.

ఇలా వచ్చిన పార్ట్ 2 ఎండింగ్ లో పార్ట్ 3 పుష్ప ది ర్యాంపేజ్ గా ఉంటుంది అని అఫీషియల్ గా తెలియజేశారు. అయితే తాజా గా ఈ పార్ట్ 3 పై ఐకాన్ స్టార్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. పుష్ప పార్ట్ 3 కోసం నాకేం తెలీదు అంటూ వ్యాఖ్యానించాడు అలాగే తనకి మాత్రమే కాదు తన డైరెక్టర సుకుమార్ కి కూడా ఇంకా ఏం తెలీదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అంటే పార్ట్ 3 అనౌన్స్ చేసినప్పటికీ ఇంకా దాని స్క్రిప్ట్ లాంటివి ఏమీ అనుకోలేదా అనే అనుమానాలు ఇపుడు వస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories