గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నేడు బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే వచ్చింది.
అయితే మేకర్స్ ఈ చిత్రం నుంచి జాన్వీపై ఒక సింపుల్ పిక్ ని సెట్స్ నుంచి షేర్ చేశారు. అయితే తనకి బర్త్ డే విషెస్ చెబుతూ తన రోల్ టెర్రిఫిక్ గా ఉండబోతుంది అంటూ రివీల్ చేసాడు. అలాగే ఆడియెన్స్ కి మీ రోల్ ని చూపించడానికి చాలా వెయిట్ కూడా చేస్తున్నాను అంటూ తాను తెలిపాడు. దీనితో ఈ సినిమాలో ఈమెకి సాలిడ్ రోల్ దక్కేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.