అఖండ 2 పై బాలయ్య బాబు ఏమన్నారంటే!

నందమూరి బాలకృష్ణ మళ్లీ ఒకసారి మాస్ మజాకాతో థియేటర్లలో కలకలం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా సినిమా “అఖండ 2 – తాండవం” ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ సినిమాకు బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ ఉండటం వల్లే కాదు, మొదటి భాగం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు కాబట్టి ఈ సీక్వెల్‌పై ఆసక్తి మరింతగా పెరిగింది.

ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ రావగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. యాక్షన్, మ్యూజిక్, డైలాగ్స్ అన్నీ కలిపి మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఉంది. ఇందులో బాలకృష్ణ అఘోరా గెటప్‌లో కనిపించడం, ఆయన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం కొంతభాగం జార్జియా దేశంలో చిత్రీకరణ జరిగింది. అక్కడ జరిగిన షూటింగ్ అనుభవాలను షేర్ చేస్తూ బాలకృష్ణ మాట్లాడుతూ, అక్కడి తీవ్రమైన చలిలో కూడా తాను సహజంగా పని చేశానని తెలిపారు. తన పాత్రపై ఉన్న నిబద్ధత వల్లనే ఆ అనుభవాలన్నీ తేలిగ్గా ఎదుర్కొన్నట్లు చెప్పారు. తనకు ఎదురయ్యే ప్రతీ సవాల్‌ను శివయ్య ఆశీర్వాదంగా భావిస్తూ ముందుకెళ్తానన్నది బాలయ్య అభిప్రాయం.

ఈ సినిమాలో బాలయ్యతో కలిసి ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా మ్యూజిక్‌ను థమన్ అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది. మొత్తానికి “అఖండ 2” కూడా మొదటి భాగం స్థాయిలో కాకుండా మరింత బలంగా బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టేలా కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories