ఏం చేస్తున్నావ్…బుచ్చన్న..మెగాస్టార్ ని కూడానా!

గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్‌, బుచ్చిబాబు సాన డైరెక్షన్‌ లో తన 16 వ సినిమా చేస్తున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ మధ్యనే జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి  మైత్రి మూవీ మేకర్స్  స్నేహితుడిగా  ఉన్న వెంకట్ సతీష్ కిలారు నిర్మాతగా మారుతున్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. దాంతోపాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది.

ఇక ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే …ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయామని సినిమా హీరో రామ్ చరణ్ తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న శివ రాజ్ కుమార్ కూడా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్  విలన్ గా నటిస్తున్నాడని వార్త తెర మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త కూడా తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా కనిపించబోతున్నారట…. అది కూడా రామ్ చరణ్ పాత్రకి తాత పాత్రలో ఆయన కనిపించబోతున్నారని వినికిడి.

ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా అని ముందు నుంచి చిత్ర బృందం చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ అనే ప్రచారం జరుగుతున్నా అది నిజం కాదని సినిమా యూనిట్ చెప్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories