ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబోలో సినిమా కోసమే అని చెప్పుకోవచ్చు. ఎన్నో నెలల నుంచి ఈ క్రేజీ కాంబినేషన్ పట్ల సాలిడ్ హైప్ నెలకొనగా నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అయితే అధికారిక క్లారిటీ వచ్చేసింది.
తమిళ భారీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఊరిస్తూ వస్తున్న అనౌన్సమెంట్ ఇపుడు వచ్చేసింది. అయితే అనుకున్నట్టుగానే మేకర్స్ ఒక సాలిడ్ అనౌన్సమెంట్ వీడియోని తీసుకొచ్చారు. ఇది మాత్రం కంప్లీట్ గా ఎవరూ ఊహించని రీతిలోనే ఉందని చెప్పాలి.
మెయిన్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి మాట్లాడ్డం అలాగే వారంతా ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఓ రేంజ్ లో వివరిస్తుండడంతో పాటు అలాగే అల్లు అర్జున్ పై కూడా మోషన్ క్యాప్చర్ ప్రయోగాలు అన్నీ చూస్తుండడంతో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో అనేది అభిమానుల ఊహకి కూడా తెలియడం లేదు. మొత్తానికి మాత్రం ఈ సెన్సేషనల్ కలయికలో ఒక ఊహించని ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా ముందుకు రాబోతుంది అని చెప్పాల్సిందే.