వార్‌ 2 డే 1 ఓపెనింగ్స్‌ ఎంతంటే!

ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లలో వార్ 2 కూడా ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మల్టీస్టారర్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజే దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ను రాబట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

హిందీ, తెలుగు వెర్షన్లకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభించగా, తమిళ్ నాట మాత్రం కొంచెం తక్కువ వసూళ్లు వచ్చినట్టు చెబుతున్నారు. మొదటి రోజే దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనాలు వస్తున్నాయి. ఇందులో ఓవర్సీస్ నుంచి వచ్చే కలెక్షన్లు కూడా కలిస్తే ఆ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ప్రారంభం నుంచే వార్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి వేగంతో దూసుకెళ్లింది. రెండో రోజు వసూళ్లు ఎలా ఉంటాయో అన్నదానిపై కూడా ఇప్పుడు అందరి దృష్టి పడింది.

Related Posts

Comments

spot_img

Recent Stories