ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘డ్యూడ్’ ఈ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన వెంటనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూ దూసుకుపోతోంది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్‌టైనర్ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. థియేటర్స్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్, యువత ఇద్దరూ ఈ సినిమాను ఆస్వాదిస్తున్నారు.
విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని చిత్రబృందం వెల్లడించింది. మొదటి వీక్‌లోనే ఇంత భారీ వసూళ్లు రావడంతో సినిమా కలెక్షన్స్ ఇంకా బలంగా కొనసాగుతాయని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. 100 కోట్ల మార్క్ దాటడం కేవలం సమయ సమస్య మాత్రమేనని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
ఈ చిత్రంలో మమిత బైజు హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు.