యశ్ కేజీఎఫ్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. పార్ట్ 1 తో పాటు పార్ట్ 2 కూడా ఘన విజయాలను సాధించాడు. అయితే ఆ సినిమా తీసిని తరువాత యశ్…చాలా కాలంగా సైలెంట్ గా ఉన్నాడు. దీంతో యశ్ తరువాత సినిమా ఏంటి అనేది అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే గీతూ మోహన్ దాస్ అనే మలయాళ లేడీ డైరెక్టర్ కి అంగీకారం తెలుపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి కానీ తాజా ప్రచారం మాత్రం షాక్ ఇచ్చే విధంగా ఉంది.. ఈ సినిమాలో కరీనాకపూర్ నటిస్తున్నట్లు కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది.
ఆ ప్రచారానికి మరింత ఊపు ఇచ్చే విధంగా ఆ మధ్య క్రూ అనే సినిమా ప్రమోషన్స్ లో కరీనాకపూర్ కూడా తాను సౌత్ లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో భాగమైనట్లు చెప్పుకొచ్చింది. ఆమె ఏ సినిమాలో నటిస్తున్నది అని చెప్పకపోయినప్పటికీ ఆమె దాదాపు సౌత్ సినిమాను ఖరారు చేసేసింది అంటూ అటు నేషనల్ మీడియాతో పాటు సౌత్ మీడియా కూడా రాసుకొచ్చింది. అయితే తాజాగా సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో కరీనాకపూర్ యష్ సరసన హీరోయిన్ మాత్రం కాదని తెలుస్తోంది.
యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సోదరి పాత్రలో కరీనాకపూర్ నటిస్తోంది అని చెబుతున్నారు. అంతేకానీ హీరోయిన్ మాత్రం కాదు.