పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం దర్శకులు మారుతీ అలాగే హను రాఘవపూడి కాంబోలో భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు కాకుండా తాను చేయనున్నమోస్ట్ అవైటెడ్ మూవీస్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్లాన్ చేసిన మాస్ ప్రాజెక్ట్ “స్పిరిట్” సినిమా కూడా ఓ మూవీ.
ఈ సినిమా మొదలు కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అలాగే అప్డేట్స్ కోసం కూడా అడుగుతున్నారు. అయితే ఎట్టకేలకు ఇందుకు సమయం ఫిక్స్ అయ్యినట్టుగా సమాచారం అందుతుంది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ స్పిరిట్ చిత్రాన్ని ఈ ఏడాది ఉగాది కానుకగా ముహూర్త కార్యక్రమాలతో మొదలు పెట్టనున్నట్టుగా తెలుస్తుంది.
సో రెబల్ అభిమానులకి అప్పటి నుంచి మంచి ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాని పాన్ ఆసియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. చైనీస్, జాపనీస్, కొరియన్ భాషల్లో కూడా మేకర్స్ ప్రకటించారు.