యూఎస్‌ లో కుబేర పరిస్థితి ఏంటి!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ కలిసి నటిస్తున్న సినిమా ‘కుబేర’పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. మెలోడియస్ మరియు డిఫరెంట్ నేరేటివ్ సినిమాలకు పేరున్న శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో మంచి పాజిటివ్ బజ్ సంపాదించుకుంది.

ఇప్పుడు ఈ సినిమా యూఎస్ మార్కెట్‌లో ప్రీమియర్ షోలకు కూడా సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేసిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కీలక సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో తెలుగు, తమిళ్ వర్షన్లకు సంబంధించిన కంటెంట్ అందుబాటులోకి వచ్చిందని, దీంతో జూన్ 19 నుంచే ఆ భాషల్లో ప్రీమియర్స్ జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు.

కానీ హిందీ వెర్షన్ విషయంలో మాత్రం కొంచెం జాప్యం జరిగిందట. అందుకే హిందీ ప్రీమియర్ షోలు ఏమీ ఉండవు, జూన్ 20 నుంచే అక్కడ హిందీ షోలు స్టార్ట్ అవుతాయని తెలుస్తోంది.

ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ టైమ్ మూవీ కావడం, అలాగే శేఖర్ కమ్ముల కొత్త జానర్‌ను ట్రై చేయడం ఈ సినిమాపై కరెంట్‌గా మంచి హైప్ తెచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories