రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. బేబీ సినిమాతో అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ‘గం, గం గణేశా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తనలోని కామెడీ యాంగిల్ ని కూడా బయటకు తీశాడు.
తాజాగా ఈ కుర్ర హీరో అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లాడు. ఆ ఈవెంట్లో పాట పాడి అదరగొట్టాడు. తన సూపర్ హిట్ సినిమా బేబీ నుంచి.. ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. అనే ఎమోషనల్ సాంగ్ ని పాడాడు. ఆనంద్ ఈ సాంగ్ ని అద్భుతంగా పాడటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆనంద్ దేవరకొండ చాలా బాగా పాట పాడాడని, తనలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రౌడీ హీరో ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ మూవీలో ఆనంద్ దేవరకొండ ఓ సాంగ్ పడితే బాగుంటుందని అనుకుంటున్నారు.