ఈ వారం థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న బడ్జెట్ లో తెరకెక్కిన “లిటిల్ హార్ట్స్” కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే టీం తమ స్టైల్ లో చేసిన ప్రమోషన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఘాటి, మదరాసి లాంటి సినిమాలు కూడా అదే రోజున విడుదల అయినా, లిటిల్ హార్ట్స్ కి మాత్రం ప్రత్యేక దృష్టి పడింది.
రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ లో ఆడియెన్స్ నుండి వచ్చిన స్పందన చాలా పాజిటివ్ గా మారింది. మొదటి రోజే కొన్ని చోట్ల హౌస్ ఫుల్ షోలు పడటంతో సినిమాకి ఊహించని బజ్ వచ్చింది. చిన్న సినిమా అయినా, ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి ఆదరిస్తుండటంతో కలెక్షన్లు కూడా మంచి స్థాయిలో ఉన్నాయి.