వామ్మో జపాన్‌ లో ఇంకా క్రేజ్ తగ్గని ఆర్‌ఆర్‌ఆర్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌,మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబోలో దర్శక ధీరుడు జక్కన్న సృష్టించిన సంచలనం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుంచే సంచలనాలు క్రియేట్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్‌ అవార్డుని అందించింది. యావత్ సినీ ప్రపంచం అంతా కూడా తెలుగు చిత్ర పరిశ్రమ వైపు తిరిగి చూసేటట్లు చేసింది.

కేవలం భారత్ లోనే కాకుండా ఈ సినిమా జపాన్‌ లో కూడా విడుదలై రికార్డులు క్రియేట్‌ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. దాదాపు ఏడాదిన్నరగా ఈ సినిమా జపాన్‌ థియేటర్లలో ఆడుతుందంటే.. దానికున్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ జపాన్‌ లో శతదినోత్సవాన్ని కూడా జరుపుకుంది.

దీంతో విదేశాల్లో వందరోజులు ఆడిన తొలి భారతీయ సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌ చరిత్ర సృష్టించింది. దీంతో జపాన్ ప్రేక్షకుల కోసం మార్చి 18న ఓ స్పెషల్‌ స్క్రీనింగ్ షోకి వెళ్లేందుకు ఆర్ఆర్‌ఆర్ టీమ్ భావిస్తుంది. ఈ విషయం తెలిసిన జపాన్‌ ప్రేక్షకులు కూడా సూపర్‌ రెస్పాన్స్‌ ఇచ్చారు.

ఈ స్పెషల్ షో కోసం బుధవారం రాత్రి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్ చేయగా… కేవలం ఒక్క నిమిషంలోనే హౌస్‌ ఫుల్ అయ్యిందంటే .. ఆర్ఆర్‌ఆర్‌ క్రేజ్‌ ఎలాంటిదో చూడండి. ఈ విషయం గురించి ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ట్విటర్ ద్వారా తెలియజేసింది. జపాన్ లో సినిమా విడుదలై సుమారు సంవత్సన్నర అయ్యింది.

అప్పటి నుంచి కూడా సక్సెస్‌ఫుల్‌ గా నడుస్తుంది. మార్చి 18 కి కూడా హౌస్‌ ఫుల్‌ అయిపోయింది. ఇందతా RRRAMPAGE అని పేర్కొన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories