వామ్మో..ఆ సినిమాలో దెయ్యంగా పూజానా?

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వం వహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని లారెన్స్‌ అభిమానుల ముందుకు తీసుకుని వచ్చాడు. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది.

ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా పలు సినిమాల్లో లారెన్స్‌ నటిస్తున్నాడు. తాజాగా కాంచన -4 ను తీసుకురాబోతున్నట్టు లారెన్స్‌ ఎప్పుడో ప్రకటించాడు. కాంచన -4 కు సంబంధించి కథ మొత్తం పూర్తయిందని, గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా అభిమానులను విపరీతంగా అలరిస్తుందని ఆ మధ్య ఓ ఇంటర్వూలో తేలిపాడు.

తాజాగా ఈ సినిమా గురించి ఓ  కీలక అప్ డేట్ ఇచ్చాడు లారెన్స్. ఈ సినిమాలో హీరోయిన్ ముంబై భామ టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేను ఎంపిక చేసారని సమాచారం. .కాంచన -4 ను దాదాపు రూ. 100 కోట్లు బడ్జెర్ట్ లో నిర్మిస్తున్నట్టు మూవీ టీమ్‌ ప్రకటించారు. కాగా ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

 ప్రస్తుతం ఈ సంస్థ లారెన్స్ హీరోగా హంటర్ సినిమాను నిర్మిస్తుంది. మొదట ఈ మూవీలో  నయనతారను హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారు కానీ ఇప్పుడు పూజా వచ్చింది. త్వరలో షూటింగ్ మొదలు కాబోతున్నట్లు టాక్‌. మరి ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి

Related Posts

Comments

spot_img

Recent Stories