లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. హీరోలతో సమానంగా పారితోషకం అందుకుంటున్న ఏకైక హీరోయిన్. టెలివిజన్ రంగంలో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నయన్…ఆ తరువాత తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే భారీ విజయం అందుకోవడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.
అటు తమిళంలోనే కాకుండా.. ఇటు తెలుగులో కూడా అగ్ర హీరోలందరి పక్కన నటించిన హీరోయిన్ నయన తార. ఇప్పటికీ సీనియర్ హీరోల పక్కన నటించాలంటే ముందుగా డైరెక్టర్ లకు గుర్తుకు వచ్చే పేరు నయన్ తారదే. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనకంటూ ఓ సపరేట్ రేట్ ను ఫిక్స్ చేసుకుని అగ్ర హీరోల పక్కన పీటెసుకుని కూర్చుంది.
అటు తమిళం, తెలుగుతో పాటు బాలీవుడ్ మీద కూడా ఈ భామ కన్నేసింది. షారుక్ ఖాన్ పక్కన జవాన్ సినిమాలో నటించినందుకు ఏకంగా రూ.10 కోట్ల పారితోషకాన్ని వసూలు చేసుకుంది. అది సినిమా కాబట్టి తీసుకుంది అనుకోవచ్చు. కానీ ఈ అమ్మడు కేవలం 50 సెకండ్ల యాడ్ కోసం ఏకంగా రూ. 5 కోట్లను వసూలు చేసింది.
టాటా స్కై కోసం ఓ యాడ్ ఫిలింలో నయన్ నటించింది. అది కేవలం రెండు రోజుల షూటింగ్ అంతేకాకుండా కేవలం 50 నిమిషాల నిడివి ఉన్న యాడ్. ఈ విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమలోని కొందరు నయన్ రేంజ్ మారిపోయిందంటూ నోరెళ్లబెడుతున్నారు.