కొన్నాళ్ల కితం నాసా(నేషనల్ ఆరోనెటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) వారు స్టార్ లైనర్ కాప్సూల్ కోసం క్రీవ్ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా, అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ కి మన భారతీయ మహిళా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ అలాగే అమెరికా నుంచి బుచ్ విల్మోర్ లని ఒక వారం రోజుల మెషిన్ కోసం గత ఏడాది జూన్ 5న పంపడం జరిగింది.
అయితే అది కాస్తా అక్కడ పలు సాంకేతిక లోపాలు మూలాన వారు అక్కడ సుమారు 9 నెలల పాటుగా ఉండిపోవాల్సి వచ్చింది. మరి ఇది ఊహించని అంశంగా మారగా వీరు అక్కడ నుంచి క్షేమంగా తిరిగి రావడం అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే ఎట్టకేలకి మళ్ళీ ఈ ఇద్దరు తిరిగి వచ్చేందుకు పూనుకోగా సేఫ్ గా ఫ్లోరిడా తీరంలో ఈ తెల్లవారు జామున సేఫ్ గా ల్యాండ్ అవ్వడం అనేది వీరి మిషన్ కి ఊహించని సుఖాంతంగా మారింది అని తెలుస్తుంది.
అయితే వీరు భూమికి సేఫ్ గా తిరిగి వచ్చిన హిస్టారిక్ మూమెంట్ పై అనేకమంది శుభాభినందనలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నారు. ఇలా లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా వీరికి మళ్ళీ భూమి మీదకి వచ్చినందుకు వెల్కమ్ చెప్పారు. ఇదొక నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ అంటూ మెగాస్టార్ తనదైన శైలిలో పోస్ట్ చేయడం ఇపుడు వైరల్ అవుతుంది.