పట్టించుకోవడం మానేశాం..!

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ఆది పినిశెట్టి. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఆది చేసే సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘శబ్దం’ ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయన పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడారు.

ఈ క్రమంలో తనకు తన భార్య నిక్కీ గల్రానీకి విడాకుల గురించిన వార్తలపై ఆది స్పందించాడు. కోలీవుడ్‌లో పలువురు స్టార్ కపుల్ మధ్య విడాకుల వ్యవహారం చోటు చేసుకోవడంతో సోషల్ మీడియాలో స్టార్స్ మధ్య విడాకుల విషయంపై అనేక వార్తలు వస్తున్నాయని.. అయితే, తను తన భార్య నిక్కీ కూడా విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని.. అవి చూసి చాలా బాధ పడ్డామని ఆది తెలిపాడు.

తన భార్య నిక్కీని తాను ఎంతగానో ప్రేమించానని.. తమ కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నామని ఆయన తెలిపారు. కానీ, యూట్యూబ్‌లో ఇలాంటి ఫేక్ వార్తలు చూసి తాము బాధపడ్డా, ఆయా ఛానల్స్ గురించి తెలుసుకుని వాటిని పట్టించుకోవడం వృథా అని వదిలేశామని ఆది తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories