హీరోయిన్ సమంత ఎల్లప్పుడూ తన ఫ్యాన్స్‌తో నేరుగా కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఒకరు జీవితాన్ని మార్చిన కోటేషన్ ఏమిటో అడిగితే, సమంత ఎప్పుడూ ఎదురయ్యే సమస్యలు కూడా మనకు పాఠం నేర్పుతాయని, వాటినుంచి ఏదో నేర్చుకోవడం ముఖ్యమని చెప్పింది.
తాజాగా ఆమె తెలుగు ప్రాజెక్ట్ గురించి అడిగితే, ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ఈ నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పింది. అలాగే, ఇషా ఫౌండేషన్‌కి ఎందుకు ఇష్టమని అడిగితే, అక్కడికి వెళ్లే అవకాసం తనకు శాంతిని ఇస్తుందని తెలిపారు. కొంతకాలం ఆరోగ్య కారణాలతో సినిమాల నుంచి విరామం తీసుకున్న సమంత, ఇప్పుడు పూర్తి శక్తితో తన నటనను కొనసాగిస్తోంది.