టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “మనమే” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం గత ఏడాది థియేటర్స్ లోకి విడుదలైంది. కానీ అప్పటి నుంచి చాలా నెలల గ్యాప్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో గత మార్చ్ 7 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక లేటెస్ట్ గా ఈ చిత్రం మరో ఓటిటిలో అలరించేందుకు రెడీగా ఉంది. ఈ చిత్రం రేపు ఏప్రిల్ 11 నుంచి మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. సో ఈ చిత్రం ఈ రెండు ఓటిటి యాప్స్ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రంలో ఆయేషా ఖాన్ తదితరులు నటించగా హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.