ప్రస్తుతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వస్తున్న రెస్పాన్స్ కంటే కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ వల్ల వాటి రిజల్ట్స్ ఓ నిర్ణయానికి వస్తుంది. ఈ జాబితాలో స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు చాలా మందే ఉన్నారు. ఇక ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్‌లో జరుగుతున్నాయో.. ఆ సినిమాలను యాంటి ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారో మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.
ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుద్ధంలో మరో ప్రెస్టీజియస్ మూవీ కూడా వార్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ‘వార్-2’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో తారక్‌తో పాటు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, ఈ సినిమాలో తారక్ పాత్ర ఏ మాత్రం తేడా కొట్టినా, సోషల్ మీడియాలో యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు దిగడం గ్యారంటీ.
గతంలో ఆయన నటించిన ‘దేవర’ చిత్రానికి కూడా నెట్టింట ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనం అందరం చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘వార్-2’లో తారక్ ఏదైనా గట్టిగా ప్లాన్ చేసే విధంగా తన పాత్రను ప్రెజెంట్ చేస్తే ఈ ట్రోలింగ్‌కు గురికాకుండా ఉండొచ్చని తెలుస్తుంది. మరి ‘వార్-2’లో తారక్ పాత్ర ఎలా ఉంటుంది.. యాంటీ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఎలాంటి ట్రోలింగ్ స్టఫ్ ఇవ్వకుండా తప్పించుకుంటుందా..? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.