బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ “వార్ 2” ఇప్పుడు సినిమా ప్రేమికుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటమే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేస్తున్న కారణం. దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసుకుంది.
ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌పై నిలిచి ఉంది. జూలై 25న విడుదల కాబోతున్న ఈ ట్రైలర్‌కు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి స్పందన లభించిందని తెలుస్తోంది. చూసిన వారు దీన్ని పూర్తిగా యాక్షన్‌తో నిండిన విజువల్ ఫెస్టుగా అభివర్ణిస్తున్నారని సమాచారం. మాస్ ఆడియెన్స్‌కు ఇది పెద్ద ట్రీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకే హైలైట్ కానున్నాయట. ఫైట్స్, చేజ్‌లు, స్టైలిష్ ఫ్రేమ్స్ అన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా తెరకెక్కించారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది.
ఇక విడుదల విషయానికి వస్తే, ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఆగస్టు 14న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ రిజల్ట్ చూస్తే, సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగే అవకాశముంది.