వార్ 2 మరో తెలుగు నటుడు!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌….బాలీవుడ్ నటుడు హృతిక్‌ రోషన్‌ కాంబోలో రాబోతున్న మోస్ట్‌ వాంటెడ్‌ పాన్‌ ఇండియా సినిమా మల్టీస్టారర్ సినిమా వార్‌ 2. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో తెలుగు నటుడు కూడా కనిపించబోతున్నాడని సమాచారం.

ఆయన మరెవరో కాదు సీనియర్ నటుడు జగపతి బాబు…జగపతి బాబు కూడా వార్‌ 2 సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అది కూడా ఎన్టీఆర్‌ కి తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు టాక్‌. ఈ సినిమా కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మోస్ట్‌ వాంటెడ్‌ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ సినిమాల్లో ఫస్ట్‌ ప్లేస్‌ ఉంది.

అంతేకాకుండా ఎన్టీఆర్-హృతిక్‌ కాంబో అనగానే ఆడియన్స్‌ లో కూడా భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న విషయం తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories