వార్‌ 2..హిట్టే..తారక్‌ ఏంటంటే..!

ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన సినిమాల్లో బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “వార్ 2” కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా, ఇందులో హృతిక్ రోషన్‌తో పాటు మన తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ కాంబినేషన్ పైనే ప్రేక్షకుల్లో ముందే భారీ హైప్ ఉండగా, ఇప్పుడు సినిమా ఓటిటిలో అందుబాటులోకి రాగానే ప్రేక్షకుల స్పందన బాగానే కనిపిస్తోంది.

ప్రత్యేకంగా ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో యాక్షన్ సీన్లు, స్క్రీన్ ప్రెజెన్స్‌ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు. తారక్ చేసిన ఎంట్రీ సీన్లు, హృతిక్‌తో ఉన్న ఫైట్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌కు ఎంతో నచ్చుతున్నాయి. అలాగే అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్‌ని చూపించిన విధానం కూడా చాలామందిని ఆకట్టుకుంటోంది.

హృతిక్ రోషన్ యాక్షన్ స్టైల్స్, ప్రీతమ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత బలం ఇచ్చాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories