నందమూరి నటసింహం బాలయ్య బాబు ఎంత కోపంగా ఉంటారో..అంతే సరదాగా కూడా ఉంటారు. తాజాగా ఆయన కొన్ని ఫన్నీ కామెంట్లు చేశారు. అసలు విషయం ఏమిటంటే తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ని నందమూరి బాలకృష్ణ హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నందమూరి బాలకృష్ణను మీరు ఎప్పుడైనా మీ భార్యకు చీర కొనుగోలు చేసి ఇంటికి తీసుకుని వెళ్లారా అని మీడియా వారు ప్రశ్నించారు.
దానికి నందమూరి బాలకృష్ణ ఆ విషయం గురించి సరదాగా మాట్లాడుతూ ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? పుల్లలు పెట్టడం అవసరమా అంటు మాట్లాడారు. దీంతో అక్కడ పరిస్థితి అంతా ఒక్కసారిగా నవ్వుల మయమైంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నందమూరి బాలకృష్ణకు 1982లో వసుంధర దేవితో వివాహం జరిగింది. కాకినాడకు చెందిన ఎస్సార్ ఎంటి ట్రాన్స్పోర్ట్ అధినేత కుమార్తె అయిన వసుంధర బాలకృష్ణ దంపతులకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ. మోక్షు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు కథలు రెడీ అవుతున్నాయి..