మరో లెజెండ్‌ కోసం ఎదురు చూస్తున్నా..

టాలీవుడ్‌ లో  ఫ్యామిలీ మ్యాన్‌ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతి బాబు. తన కెరీర్‌ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన చాలా గ్యాప్‌ తరువాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టారు.

ఈ సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో నటసింహం బాలయ్య బాబు నటించిన లెజెండ్‌ సినిమాతో తన సెకండ్‌ కెరీర్‌ ను ప్రారంభించాడు. అందులో జగపతి బాబు నెగిటివ్‌ రోల్‌ కి ఎన్నో అవార్డులు కూడా వరించాయి. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

తనకు చిన్న చిత్రాల్లో కూడా నటించాలని ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చిన్న చిత్రాలు కూడా చాలా కొత్తగా ఉంటున్నాయని..పెద్ద చిత్రాలు కూడా చేస్తున్నప్పటికీ వాయిదా పడుతున్నాయని చెప్పుకొచ్చాడు. రెమ్యునరేషన్‌ కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో చిన్న చిత్రాలు
కూడా రావడం లేదని తెలిపారు.

తాను ప్రస్తుతం పూర్‌ రిచ్‌ మ్యాన్‌ అని చెప్పుకొచ్చారు. మరో లెజెండ్‌ కోసం ఈ సమయంలో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories