విశ్వం ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసిందోచ్‌!

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా.. గ్లామరస్ యంగ్ హీరోయిన్ కావ్య థాపర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న మోస్ట్‌ అవైటెడ్ మూవీ “విశ్వం” . తాజాగా ఈ సినిమా టీజర్ వీడియోతో డీసెంట్ బజ్ ని తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

మరి ఈ లిరికల్ వీడియో సాంగ్ వినేందుకు మాత్రమే కాకుండా చూసేందుకు కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. మోరోకాన్ మగువా అంటూ సాగే ఈ సాంగ్ కి చైతన్ భరద్వాజ్ తన మార్క్ స్టైలిష్ బీట్స్ ని ఓ రేంజ్‌ లో అందించాడు. అలాగే రాకేందు మౌళి ఇచ్చిన సాహిత్యం కూడా ట్రెండీగా మారింది. ఇక సాంగ్ విజువల్ పరంగా కూడా బాగుంది.

గోపీచంద్ మంచి స్టైలిష్ గా కనిపిస్తుండగా కావ్య థాపర్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ సాంగ్ లో ఇద్దరి కాస్ట్యూమ్స్ కూడా వారి పర్సనాలిటీని సాంగ్ కి తగ్గట్టుగా చాలా బాగా కుదిరాయి. ఇలా ఈ సాంగ్ అయితే బాగానే ఉందని తెలుస్తుంది. మరి థియేటర్స్ లో ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో  చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories