ఫుల్‌ జోష్‌ లో విశ్వంభర టీమ్‌!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న మోస్ట్‌ అవైటెడ్ భారీ చిత్రం “విశ్వంభర”.  ఈ సినిమాని మెగాస్టార్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బడ్జెట్ గా రూపొందించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా చిరంజీవి చాలా కాలం తర్వాత చేస్తున్న ఫాంటసీ వండర్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే శరవేగంగా పూర్తి చేస్తుండగా రీసెంట్ గానే చిత్ర బృందం మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చొని విశ్వంభర ఆల్బమ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.అయితే ఈ ఆల్బమ్ కి వర్క్ చేస్తున్న ప్రముఖ సింగర్స్ తో కీరవాణి ఫుల్ స్వింగ్ లో వర్క్ చేయిస్తుండగా మెగాస్టార్ అయితే ఫుల్ ఎనర్జిటిక్ గా మంచి జోష్ లో కనిపిస్తున్నారు.

తనపై కూడా కొన్ని వీడియోస్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి విశ్వంభర ఆల్బమ్ ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక ఈ చిత్రంలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 10 న సినిమా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories