విశ్వంభర డేట్‌..తమ్ముడు పై ఎఫెక్ట్‌!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సినిమానే విశ్వంభర. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ తో పాటు , ప్రేక్షకుల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌పై మంచి ఆసక్తి నెలకొంది. గతంలో విడుదల తేదీని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు థియేటర్లలోకి రాలేదు.

ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా ఇంకా రిలీజ్ కాకపోవడంతో అభిమానుల్లో ఆతృత పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల అయ్యే అవకాశముందని ఇండస్ట్రీలో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ డేట్ కన్‌ఫర్మ్ కాకపోతే సెప్టెంబర్ 25న సినిమా రావచ్చని ఇంకొంతమంది చెబుతున్నారు.

అయితే, ఈ డేట్ చుట్టూ మరో ఆసక్తికర అంశం ఉంది. అదే రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా కూడా థియేటర్లకు రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి సినిమా ఎప్పుడు వస్తుందో అన్న ఉత్కంఠ మెగా అభిమానుల్లో మరింత పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో విశ్వంభర రిలీజ్ తేదీపై క్లారిటీ రావాలి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఎందుకంటే, చిరంజీవి సినిమా అంచనాలు ఎలా ఉంటాయో, ఫ్యాన్స్‌ ఎలా రెస్పాండ్ అవుతారో తెలిసిందే. పైగా ఈ సినిమా ఒక పెద్ద ఫాంటసీ అడ్వెంచర్ కావడంతో భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి చివరికి మూవీ ఏ తేదీన థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories