మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’పై ప్రేక్షకుల అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా ఇపపటికే థియేటర్లకు రావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కుల విషయంలో కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, జియో హాట్‌స్టార్ ‘విశ్వంభర’ డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ డీల్ వల్ల చిత్ర నిర్మాతలు సంతృప్తిగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.