టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంభర కోసం అందరికీ తెలిసిందే. అయితే కొంత కాలం నుంచి సాలిడ్ అప్డేట్ లేదు అని బాధ పడుతున్న అభిమానులకి విశ్వంభర మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇప్పుడు తీసుకుని వచ్చారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ మెగాస్టార్ పై అదిరే పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
రామ రామ అంటూ సాగే ఈ డివోషనల్ సెలబ్రేటింగ్ సాంగ్ ని మేకర్స్ ఈ ఏప్రిల్ 12న రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు. మరి ఇందులో మెగాస్టార్ సహా ఆంజనేయ స్వామి గెటప్ లో ఉన్న చిన్న పిల్లలతో చూస్తుంటే కలర్ ఫుల్ గా హిట్ సాంగ్ లా కనిపిస్తోంది.