తమిళ స్టార్ విశాల్ కి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఆయన ‘మకుటం’ అనే కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఆయన పెళ్లి గురించి చాలా కాలంగా ఫిల్మ్ నగర్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఒకోసారి వేరే హీరోయిన్ పేర్లు బయటకొచ్చినా, ఇప్పుడు మాత్రం స్పష్టత వచ్చింది. విశాల్ జీవిత భాగస్వామిగా హీరోయిన్ సాయి ధన్సికను ఎంచుకున్నట్టు సమాచారం.
ఇక విశాల్ పుట్టినరోజు రోజునే ఆమెతో కలిసి ఎంగేజ్మెంట్ జరుపుకున్నట్టు ఆయన అధికారికంగా వెల్లడించాడు. ఈ వేడుకలో ఇరువురు కుటుంబాలు కలిసి పాల్గొనగా, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.