విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా దర్శకుడు ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం “వీర ధీర శూర – పార్ట్ 2” కోసం అందరికీ తెలిసిందే. తమిళ్ సహా తెలుగులో కూడా విడుదలకి వచ్చిన ఈ చిత్రంలో వెర్సటైల్ నటుడు ఎస్ జే సూర్య, 30 ఇయర్స్ పృథ్వీ వంటి వారు సాలిడ్ పాత్రలు చేశారు. అయితే ఈ సినిమా గత వారం థియేటర్స్ లో విడుదలకి రాగా ఈ వారంలో మంచి వసూళ్లనే అందుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు
వరల్డ్ వైడ్ గా ఈ రెండు భాషల్లో కలిపి ఈ సినిమా 52 కోట్ల గ్రాస్ ని చేరుకుందంట. ఇది విక్రమ్ విషయంలో ఇటీవల కాలంలో పర్వాలేదనిపించే రేంజ్ పెర్ఫామెన్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి మరో సినిమా కూడా ఉండగా దీనిని కూడా మేకర్స్ రిలీజ్ కి తీసుకురానున్నారు.