జపాన్‌ లో విడుదలైన విక్రమ్‌..సాలిడ్‌ వసూళ్లు!

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన భారీ హిట్ విక్రమ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ అండ్ క్లాస్ మిక్స్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి అప్పట్లో ఆడియన్స్ కి పక్కా ఫుల్ ఫెడెడ్ ట్రీట్ ఇచ్చింది. త్రిబుల్ యాక్షన్ ప్యాకేజీగా వచ్చిన ఈ చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించాడు. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో అదే ఫ్రెష్‌నెస్‌తో ఉంది.

ఇక ఇటీవలే అంటే ఈ చిత్రానికి మూడేళ్లు పూర్తవుతుండగా ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మే 30న విక్రమ్ మూవీ జపాన్‌లో రిలీజ్ అయ్యింది అనే విషయం చాలా మందికి తెలియలేదు. శబ్దం లేకుండా అంటే పెద్దగా హైప్ లేకుండా అక్కడ విడుదల చేశారు. అంతేకాదు కేవలం 55 థియేటర్లలో మాత్రమే రిలీజైంది.

అయితే ఇంత తక్కువ స్క్రీన్ కౌంట్ ఉన్నప్పటికీ మొదటి కొన్ని రోజుల్లోనే మంచి వసూళ్లు రాబట్టింది. మొదటి వారం రోజుల్లోనే దాదాపు 8.4 మిలియన్ యెన్స్ అంటే మన కరెన్సీ ప్రకారం 50 లక్షలకు పైగా కలెక్షన్ వచ్చిందట. దీని ద్వారా జపాన్ ఆడియన్స్‌కి కూడా విక్రమ్ చిత్రం ఎంతగా నచ్చిందో అర్థమవుతుంది.

ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర మేటగా ఉండగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాకి వెన్నెముకలా నిలిచాడు. ఇండియాలో కలెక్షన్ల పరంగా ఘనవిజయం అందుకున్న విక్రమ్, ఇప్పుడు జపాన్‌లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories