మంచి హైప్‌ తెచ్చుకున్న విజయ్‌ మూవీ!

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్డమ్ ఇప్పుడు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ప్రస్తుతం బాగా చర్చనీయాంశమవుతోంది. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ కాగా, తాజాగా విడుదల చేసిన ఒక చిన్న ప్రోమోతో అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ ప్రోమో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. తక్కువ నిడివితో ఉన్నప్పటికీ ఇందులో చూపించిన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, విజయ్ లో కనిపించిన విభిన్న షేడ్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతున్నాయి. దర్శకుడు గౌతమ్ టేకింగ్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం ఈ ప్రోమోకి మరింత బలాన్నిచ్చింది.

విజయ్ దేవరకొండ గత చిత్రాల కంటే పూర్తి భిన్నంగా కనిపిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో గ్రాండ్‌గా తయారు చేశారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను జూలై 31న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రోమోతోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేలా ఉందని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్ని రోజులుగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుండడం, పైగా ప్రొమో కంటెంట్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే కింగ్‌డమ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సెట్ చేయొచ్చనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు అందరి కళ్లూ జూలై 31పైే ఉన్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories