సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “కింగ్డమ్” ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించింది. రిలీజైన తొలి రోజే మంచి అటెన్షన్‌ను సంపాదించిన ఈ సినిమా, మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.
ప్రేక్షకుల ఆసక్తితో థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్న ఈ చిత్రం రెండో రోజూ ఊహించిన దానికంటే మెరుగైన కలెక్షన్లు రాబట్టింది. రెండు రోజుల షేర్లను కలిపి చూసుకుంటే, సినిమా ఊహించని స్థాయిలో దూసుకుపోతున్నట్లు స్పష్టమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ రెండో రోజు దాదాపు 4.11 కోట్ల షేర్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క నైజాంలోనే ఈ సినిమా 1.85 కోట్ల షేర్‌ను అందుకోగా, మిగిలిన ఏరియాల నుంచి కూడా స్థిరమైన కలెక్షన్లు వచ్చాయి.
ఇప్పటికే రెండు రోజులకు గాను కింగ్డమ్ చిత్రం 14 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. ముఖ్యంగా నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో ఈ మూవీకి మంచి క్రేజ్ కనిపిస్తోంది. వీకెండ్ బుకింగ్స్ ఇప్పటికే బాగా ముందుకు పోతుండటంతో, రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులను ఈ సినిమా తాకుతుందో చూడాలి.
మొత్తానికి మొదటి రెండు రోజులు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా నిలకడగా పర్ఫామ్ చేస్తూ, వీకెండ్‌కు బలమైన బజ్‌ని సెట్ చేసింది. ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ సర్కిల్స్ కూడా సినిమా పెర్ఫార్మెన్స్‌ను గమనిస్తూ భారీ వసూళ్లను ఆశిస్తున్నారు.