టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం “కింగ్డమ్”. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ పాత్ర స్పై యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఇటీవల రిలీజ్ అయిన పాట కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక, “కింగ్డమ్” సినిమా విడుదల తేదీకి సంబంధించి మొదట పవన్ వీరమల్లు సినిమా కారణంగా కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. “కింగ్డమ్” సినిమాకు మే 30నే విడుదల అవ్వాలని తాజా సమాచారం తెలియజేస్తోంది. “హరిహర వీరమల్లు” చిత్రానికి ఇంకా ఒక సరి విడుదల తేదీ ఖరారు కాలేదు, అందువల్ల “కింగ్డమ్” సినిమా అంచనాల ప్రకారం సమయానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.