విశాఖలో కింగ్‌డమ్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్, టీజర్‌ను నిన్న(ఫిబ్రవరి 12) రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్స్ మొదలుకొని, ఆయన పర్ఫార్మెన్స్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తాజాగా వైజాగ్‌లో అడుగుపెట్టాడు. ఈ లాస్ట్ షెడ్యూల్‌తో మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు

Related Posts

Comments

spot_img

Recent Stories